జలుమూరు మండలం తమ్మయ్యపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎంఈఓ 2 ఎం వి ఆర్ ఎస్ ప్రసాదరావు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల బోధన పట్ల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రతిరోజు డిక్టేషన్, రీడింగ్ ప్రక్రియలను చేపట్టాలని, బోధనలో మెలకువలు పాటించాలని సూచించారు. అనంతరం పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి సూచనలు చేశారు.