జలుమూరు: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంఈఓ

జలుమూరు మండలం శ్రీముఖలింగం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ 2 ఎం వి ఆర్ ఎస్ ప్రసాదరావు గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. భోజన సమయానికి చేరుకుని, మెనూ అమలు తీరును వంట ఏజెన్సీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వంట చేసేటప్పుడు ఉపాధ్యాయులకు వివరంగా తెలియజేయాలని, కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్