జలుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఎంఈఓ ప్రసాదరావు మంగళ హారతులతో సాదరంగా ఆహ్వానం పలికారు. శుక్రవారం విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. స్థానిక పాఠశాల హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మండ రామారావు మాట్లాడుతూ 33 మంది విద్యార్థులు నూతనంగా పాఠశాలలో చేరారని తెలియజేశారు.