జలుమూరు మండలం పెద్దదూగాం వద్ద ఉన్న 24 నరసన్నపేట బ్రాంచ్ కెనాల్ నుండి సాగునీటిని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విడుదల చేశారు. ఆదివారం ఉదయం కెనాల్ కు చేరుకున్న అనంతరం పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేపిస్తున్నామని, నరసన్నపేట, పోలాకి మండలాలలో 37, 700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వంశధార అధికారులు, డిస్ట్రిబ్యూటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.