జలుమూరు: శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతోసమీక్షించిన ఎమ్మెల్యే

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం శ్రీముఖలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సదుపాయం, రహదారుల భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి, సీఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్