జలుమూరు: పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించండి

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు స్టడీ అవర్స్ ప్రత్యేకంగా నిర్వహించాలని ఎంఈఓ 2 ఎం వరప్రసాదరావు తెలిపారు. గురువారం జలుమూరు మండలం తిమడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. బోధన పట్ల విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలలో ఉన్నత ఫలితాలు సాధించే దిశగా నేటి నుండే విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం బి సుమలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్