జలుమూరు: పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

జలుమూరు మండలం చల్లవానిపేటలో అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి. అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఆరు పశువులు ఉన్నట్లు గుర్తించారు. బలద సంత నుండి నారాయణ వలస సంతకు పశువులను తరలిస్తున్నట్లు వాహన యజమాని పట్ట గోవిందరావు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్