జలుమూరు: పాలిసెట్ ఫలితాలలో 26వ ర్యాంకుతో మెరిసిన రోహిత్

పాలిసెట్ పరీక్షా ఫలితాల్లో చిన్నాల రోహిత్ 120కి 119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 26వ ర్యాంకు పొందాడు. రోహిత్ జలుమూరు మండలం చల్లవానిపేట పంచాయితీ ఫంగ పేట గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి కన్నయ్య రైతు, తల్లి కృష్ణకుమారి ఉపాధ్యాయురాలు. పదో తరగతిలోనూ మంచి మార్కులు సాధించిన రోహిత్‌ను పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్