జలుమూరు: శ్రీముఖలింగం లో ప్రారంభమైన రెండవ విడత భూ సర్వే

జలుమూరు మండలం శ్రీముఖలింగం రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండవ విడత సమగ్ర భూ సర్వే శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఆర్ పుష్పలత మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా సర్వే నిర్వహించాలని, ఏ రైతుకు అన్యాయం జరగకూడదని సూచించారు. ఈ సర్వేలో మండల సర్వేయర్ టి నాగేశ్వరరావు, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్