జలుమూరు మండలం శ్రీముఖలింగంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారిని తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రెటరీ టి. ఎన్. వెంకటేష్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఉన్న స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విశిష్టతను అర్చకులు ఆయనకు తెలియజేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ జె రామారావు ఆయనను కలుసుకున్నారు.