జలుమూరు: 'ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం'

ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలంలోని నరసన్నపేట బ్రాంచ్ కాలువల ద్వారా ఆదివారం సాగునీరు విడుదల చేశారు. శివారు భూములకు నీరు అందించేలా కాలువలను ఆధునీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్