జలుమూరు మండల కేంద్రానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్ క్లాత్ సోమవారం ఉదయం స్థానిక ఎంఆర్సీ కార్యాలయానికి చేరుకుంది. మండలంలో మొత్తం 3,162 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే వారికి యూనిఫామ్స్ అందజేస్తామని ఎంఈఓ 2 ఎం.వి.ఆర్.ఎస్. ప్రసాదరావు తెలిపారు. ఈ యూనిఫామ్ క్లాత్ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా అందిస్తున్నారు.