నరసన్నపేట మండల కేంద్రంలోని పలు బంగారు దుకాణాలలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా అసిస్టెంట్ అధికారిని పి చిన్నమ్మ మాట్లాడుతూ ఇటీవల నరసన్నపేటలో బంగారు దుకాణాలలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని వివరించారు. వినియోగదారులకు ఇస్తున్న బిల్లులలో క్యారెట్లు నమోదు చేయడం లేదంటూ నిర్ధారించారు. దీనిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.