నరసన్నపేటలో జట్టు కళాసి యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ వేడుకలను స్థానిక యూనియన్ సభ్యులు నిర్వహించడం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిని బగ్గు అర్చన, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.