నరసన్నపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోర్టు సందర్శన తప్పదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు ఈనెల 30వ తేదీన చేపట్టనున్న మూలపేట పోర్టు సందర్శనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య ఆరోపించారు. ఆదివారం నరసన్నపేట వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు పెట్టినా సందర్శన ఆగదని స్పష్టం చేశారు. ఎస్పీకి ముందుగా తెలియజేసినప్పటికీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సందర్శనను ఆపే ప్రసక్తి లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్