విశాఖపట్నం జిల్లా దువ్వాడలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లుకలాపు హరికృష్ణ (31) బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన హరికృష్ణ, భార్య వెంకటలక్ష్మితో కలిసి దువ్వాడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనతో నడగాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.