నరసన్నపేట: చిన్న కరగాంలో నిరుపయోగంగా చెత్తనుండి సంపద కేంద్రం

నరసన్నపేట మండలం కరగాం పంచాయతీ చిన్న కరగాం గ్రామంలో వేల రూపాయలు ఖర్చుతో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రం నిరుపయోగంగా మారింది. తడి, పొడి చెత్తను వేరు చేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నీరుగారిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం నిర్వహణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత పోస్ట్