నరసన్నపేటలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన నిర్మిస్తున్న వెల్నెస్ కేంద్రం భవన నిర్మాణాలు ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. గత వైసిపి ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించేందుకు 17.50 లక్షల రూపాయలు కేటాయించి, 2020 నవంబర్ లో పనులు ప్రారంభించింది. నేటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.