ఆర్మీలో సుబేదార్ గా సేవలందించి పదవీ విరమణ పొందిన తోలాపి భూషణరావును మంగళవారం రాత్రి నరసన్నపేట మండలం కరగాం గ్రామంలో గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కార్గిల్, ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధాలలో పాల్గొన్న భూషణరావు 30 ఏళ్ల సేవ తర్వాత గ్రామానికి తిరిగి రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన ఉన్నత స్థాయికి ఎదగడం గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు.