నరసన్నపేట ప్రధాని రహదారిలో ఉన్న జామియా మసీదులో ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నరసన్నపేటతో పాటు పలు గ్రామాల నుండి వచ్చిన ముస్లింలు మసీదు ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏటా బక్రీద్ వేడుకలను నిర్వహిస్తున్నామని మత పెద్దలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.