నరసన్నపేట: ఢీకొన్న బైకులు.. ఇద్దరు గాయాలు

నరసన్నపేట మండలం రావాడ పేట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జలుమూరు నుండి వస్తున్న ఎం. సింహాద్రిని, నరసన్నపేట నుండి వస్తున్న తిరుపతిరావు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సింహాద్రికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నరసన్నపేట ఆసుపత్రి నుండి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్