నరసన్నపేట పట్టణంలోని పెద్దపేట వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించామని ఉపాధ్యాయురాలు రాంబాయి తెలిపారు. గురువారం ఉదయం సచివాలయ ఎమ్ ఎల్ హెచ్ పి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఇటీవల వైరల్ జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా ఈ పరీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.