భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం నరసన్నపేట మండలంలోని ఆదివారపు పేటలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. లేబర్ కోడ్, కార్మిక చట్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.