నరసన్నపేట: ప్రమాదపు మలుపులు.. వాహనదారులకు ఇక్కట్లు

నరసన్నపేట మండలం యారబాడు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారిలో మలుపుల నడుమ తుప్పలు పెరిగిపోవటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ రాత్రి వేళల్లో ఈ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు లేకపోవడంతో మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్