కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నరసన్నపేట టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం కొత్త పోలవలస పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఏడాది పాలనలోనే ప్రభుత్వం ఎంతో అభివృద్ధిని సాధించిందని గుర్తు చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు, రేపు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందజేయడం జరుగుతుందన్నారు.