నరసన్నపేట: శ్రీ వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు ప్రత్యేక అలంకరణతో దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఉచిత తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్