నరసన్నపేట: శిరిడి సాయినాధుని ఆలయానికి భక్తుల తాకిడి

నరసన్నపేట మండలం కలివరపుపేటలోని ధ్యాన మందిర శిరిడి సాయి నాధుడి ఆలయానికి గురువారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, కాగడ హారతులు సమర్పించారు. కార్తీక మాసం కారణంగా ఆలయంలో భక్తుల సందడి పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదాలను కూడా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్