నరసన్నపేట: గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి

నరసన్నపేట మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అరంగి మురళీధర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ఎనలేని పోరాటాన్ని చేసిన ఘనత గాంధీజీకే దక్కుతుందని తెలిపారు. శాంతి మార్గాన్ని నడిచిన ఆయనను గాడ్సే హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్