శనివారం నరసన్నపేట మండలం నారాయణ వలస రెవెన్యూ గ్రామంలో తహసిల్దార్ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవరం నీటి సంఘం అధ్యక్షుడు సిమ్మ లక్ష్మణరావు మాట్లాడుతూ, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తహసిల్దార్ మాట్లాడుతూ, నాలుగు గ్రామాలలో రెండు వేలకు పైగా పాసుపుస్తకాలు రైతులకు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.