నరసన్నపేట: రీ సర్వేకు రైతులు అధికారులకు సహకరించండి

రెవెన్యూ గ్రామాలలో చేపడుతున్న సమగ్ర భూ రీ సర్వేకు రైతులు అధికారులకు సహకరించాలని తహసిల్దార్ టి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండలం సత్యవరం రెవెన్యూ గ్రామంలో మండల సర్వేయర్ బృందం పర్యటించింది. సత్యవరం గ్రామంలో 1600 రైతు ఖాతాలు ఉన్నాయని, రైతులు సహకరిస్తే సర్వే త్వరితగతిన పూర్తవుతుందని మండల సర్వేయర్ అప్పలస్వామి పేర్కొన్నారు. ఈ సర్వేలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్