నరసన్నపేట: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించండి

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం కంబకాయ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎరువుల వాడకంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాగోటి ఉమా, ఎడి వెంకట మధు, ఏవో సూర్యకుమారి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్