నరసన్నపేటలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణం కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు మల్లికార్జున స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.