నరసన్నపేట: సత్యవరంలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంపీపీ అరంగి మురళీధర్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండల పరిషత్ నుండి 3 లక్షలు, పంచాయతీ నిధుల నుండి 2 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు మురుగు సమస్య పరిష్కారానికి ఈ నిధులు మంజూరు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్