నరసన్నపేట పట్టణం గంజాయి అడ్డాగా మారిపోయిందని ఇది ఎంతో దురదృష్టకరమని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం రాత్రి కోరాడ రాకేష్ అనే షాపు యజమాని పై గంజాయి బ్యాచ్ దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారులకు భద్రత కరువైపోయిందని పేర్కొన్నారు.