నరసన్నపేట: ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని, మన ఊరు బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం నరసన్నపేట పట్టణంలో వీధుల్లో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలుసుకున్నారు. ప్రతి ఏడాది వచ్చిన ఫలితాలలో ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్