నరసన్నపేట: గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేయటం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం కిల్లాం నుండి మాకివలస వరకు కోటి పది లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోడి రామన్న, ఉప సర్పంచ్ పొట్నూరు సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్