జాతీయస్థాయిలో జరగనున్న గట్క (కర్ర సాము) పోటీలకు నరసన్నపేట మండలం సత్యవరం జడ్పీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతిరాణి కోచ్‌గా ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి ఆమె మాట్లాడుతూ, ఈ పోటీలకు తనకు కోచ్‌గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఈనెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.