నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం మాఘమాసం శుద్ధ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు చామర్తి శ్రీనివాసాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మంగళహారతులు అందజేశారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.