డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రుచికరమైన, విందు భోజనాన్ని తలపించేలా భోజనం అందించాలని డిఇఓ రవిబాబు తెలిపారు. గురువారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వంట ఏజెన్సీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ఎంఈఓ దాలినాయుడు, డిఆర్పి ఉత్తర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.