సిఐటియు జిల్లా ట్రెజరర్ అల్లు సత్యనారాయణ, ఈ నెల నాలుగవ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్న అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నరసన్నపేటలోని ఆదివారపు పేటలో ఉన్న శ్రీ సంతోషిమాత భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనం వద్ద ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాలు కార్మికులకు అందాల్సిన సంక్షేమాన్ని విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు.