నరసన్నపేట: భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో సుమారు 80 మంది దంపతులు ఈ వ్రతాలలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, ఉచిత ప్రసాదాలను అందజేశామని ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి శ్రీనివాసచార్యులు, ఆలయ ధర్మకర్త వారణాసి మురళి తెలిపారు.

సంబంధిత పోస్ట్