నరసన్నపేట: విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించిన ఎంఈఓ

నరసన్నపేట మండలం కోమర్తి పంచాయితీ లకిమేర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ 1 ఉప్పాడ శాంతారావు గురువారం పరిశీలించారు. ఆయన విద్యార్థుల సామర్థ్యాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ హోంవర్క్ తప్పనిసరిగా పూర్తి చేయాలని, పాఠ్యాంశాల వివరాలను వర్క్ బుక్ లో వ్రాసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలో మౌలిక వసతులను సరిచూసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్