నరసన్నపేట: బోర్డుబంగ్లా ఆక్రమణపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

నరసన్నపేట నడిబొడ్డున ప్రభుత్వ బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం శూన్యమైందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నరసన్నపేట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కబ్జా జరుగుతున్న విషయం తన దృష్టికి రాగానే కలెక్టర్, ఎంపీడీవో, ఈవోలకు సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అయినప్పటికీ నేటికీ ఎటువంటి చర్యలు జరగలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్