శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్ మాట్లాడుతూ ఆపద సమయంలో తక్షణమే ఆదుకోవాల్సింది శక్తి యాప్ మాత్రమేనని తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం మడపాం జడ్పీ పాఠశాలలో విద్యార్థినిలకు యాప్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పోలాకీలో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అని, 112కు కాల్ చేస్తే ఎక్కడ ఉన్నా పోలీసులు అప్రమత్తమై ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.