నరసన్నపేట మండలం కరగాం గ్రామంలో ఏడేళ్ల క్రితం పిల్లలు లేరనే కారణంతో మూసివేసిన ప్రాథమిక పాఠశాలను తిరిగి తెరవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం తమ గ్రామంలో పిల్లలు ఉన్నప్పటికీ, కిలోమీటన్నర దూరంలో ఉన్న చిన్న కరగాం పాఠశాలకు పంపాల్సి వస్తోందని, తమ ఊరి బడిని పునఃప్రారంభించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో తమ గ్రామంలోని బడిని తెరిపించాలని వారు కోరుతున్నారు.