నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీలో కళాజాత ఆధ్వర్యంలో ఉపాధి వేతన దారులతో కలిసి సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి సంబంధిత సిబ్బందికి అందించాలని కళాకారులు సాయి కృష్ణ, చిరంజీవి తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, పారిశుధ్యంపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు.