జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నరసన్నపేట ఇందిరానగర్ కు చెందిన తండ్యాల పవన్ సాయి ఆల్ ఇండియా కేటగిరిలో 702, ఓబిసి కేటగిరీలో 118వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల నేపథ్యంలో, ఉపాధ్యాయులైన తండ్రి జనార్ధన రావు, తల్లి పద్మావతి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ సాయిని పలువురు అభినందించారు.