నరసన్నపేట: ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించవలసిందే

విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎంఈఓ పేడాడ దాలినాయుడు హెచ్చరించారు. శుక్రవారం నరసన్నపేట ఎంఆర్సి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జీవో నెంబర్ ఒకటి ప్రకారం మౌలిక వసతులు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్