నరసన్నపేట మండలం కోమర్తి పంచాయితీలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకుని, మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.