నరసన్నపేట: మెరుగైన వైద్య సేవలు అందించండి: ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేట ఏరియా హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రిలో జరిగిన కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఆసుపత్రిని మళ్ళీ ఆ స్థితికి తీసుకురావడానికి వైద్యులు కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్